Pradhanmantri Suryoday Yojana Modi Tweet On Free Electricity Detail


ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసే సౌర ఫలాకాలను ఏర్పాటుచేయబోతున్నారు.ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. గతంలో 40శాతం సబ్సిడీ ఇస్తే.. ఇప్పుడు దానిని 60శాతానికి పెంచారు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని ప్రజలు రుణంగా తీసుకోవచ్చు.

తాజా బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ స్కీమ్‌ను ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. దీని ద్వారా కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన కింద ఈ బెనిఫిట్ పొందొచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానేనే ప్రజలు తమ పైకప్పులపై విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారు PMSY పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది తమ ఇళ్లలో సోలార్ ప్యానెల్స్‌ను పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వారికి ఇందులో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి, ప్రజల శేయస్సు కోసం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

కోటి గృహాల్లో సౌర వెలుగులు నింపేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం 75 వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల ఉచిత కరెంట్ పొందవచ్చని ప్రధాని మోడీ అన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.

ఈ సోలార్ పానల్స్ తో లబ్ధిదారుడు తమ అవసరానికి మించి అధికంగా కరెంట్ ఉత్పత్తి చేస్తే.. దానిని SPV కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బుల ద్వారా రుణాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా 10 సంవత్సరాలలో మీ రుణాన్ని పూర్తిగా చెల్లిస్తారు. ఆ తర్వాత సోలార్ ప్యానెల్‌ను లబ్ధిదారుని పేరుకు బదిలీ చేస్తారు.

Post a Comment

Previous Post Next Post