DSC 2024: డీఎస్సీ నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం !


 

DSC 2024: డీఎస్సీ నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని ప్రభుత్వానికి హై కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ నుండి జరగబోయే డిఎస్సీ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. గతంలో నిర్వహించిన విధంగా టెట్ కు, డీఎస్సీలకు మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తరువాత ‘కీ’ పై అభ్యంతరాలకు తగిన సమయం అభ్యర్ధులకు ఇవ్వాలని సూచించింది. హడావిడిగా డీఎస్సీ నిర్వహించకుండా… అభ్యర్ధులకు తగిన సమయం ఇచ్చి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనితో కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ షెడ్యూలను ప్రభుత్వం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


DSC 2024 Supreme Court Comment


ఏపీ ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు జరగబోతుండటం… వైసీపీ(YSRCP) అధికారంలోనికి వచ్చిన తరువాత ఇదే మొదటి డీఎస్సీ నోటిఫికేషన్ కావడంతో… టెట్, డీఎస్సీ పరీక్షలను తగినంత సమయం ఇవ్వకుండా పరీక్ష తేదీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలపై అభ్యంతరాలపై కోర్టును ఆశ్రయించారు కొంతమంది డీఎస్సీ అభ్యర్ధులు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం… పిటీషనర్స్ అభిప్రాయాలతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. గతంలో నిర్వహించిన విధంగా తగినంత సమయం ఇచ్చి డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Post a Comment

Previous Post Next Post