Deadpool & Wolverine: మెస్మరైజ్ విజువల్స్ తో మార్వెల్ స్టూడియోస్ 'డెడ్‌పూల్ & వోల్వారిన్' ట్రైలర్ విడుదల !



Deadpool & Wolverine: మార్వెల్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ .

ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.




Post a Comment

Previous Post Next Post