Nandi awards | గద్దర్ పేరుతో సినీ అవార్డులు : రేవంత్




తెలుగు సినీ కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ‘నంది అవార్డు’. సినిమా రంగంలోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుని అందిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డు తరువాత సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఈ అవార్డుల పురస్కారం పట్ల నిర్లక్ష్యం మొదలయింది.. ఇక 2017 నుంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేసాయి. కాగా, తాజాగా కళారంగంలో ప్రముఖ ప్రజా కవి గద్దర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన చేశారు.

హైదారాబాద్ లో రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆయనకి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. త్వరలోనే ఈ పేరు మార్పు పై జీవోని జారీ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ ప్రతీ జయంతికి ఈ పురస్కార ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post