New Rules And Regulations For Coaching Centers Details


కోచింగ్ సెంటర్లకు కొత్తరూల్స్.కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్‌ గైడ్‌లైన్స్‌ ఇవే.!  Coaching Centers భారతదేశంలో అకడమిక్స్‌తో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు చాలామంది కోచింగ్‌ సెంటర్లకు వెళ్తారు. ముఖ్యంగా ఎంట్రన్స్‌, కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌లకు ప్రిపేర్‌ అయ్యేవారు తప్పక కోచింగ్ తీసుకుంటారు. దేశంలో ఇలా చాలా ప్రాంతాలు కోచింగ్‌కి ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్ని ఇన్‌స్టిట్యూట్లలో విద్యార్థులు ఒత్తిడి, పోటీ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వార్తలు ఆందోళనకరంగా మారాయి. 

ఫీజులు కూడా భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు, నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యార్థుల శ్రేయస్సును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.   2024 జనవరి 18న ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్‌ రెగ్యులేటెడ్‌ కోచింగ్ సెంటర్‌లు, విపరీతమైన ఫీజులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యాపరమైన ఒత్తిడి వంటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. 

కోచింగ్ సెంటర్లకు కొత్త మార్గదర్శకాలు, ప్రయోజనాలు చూద్దాం.   మార్పులు అవసరం  అన్‌రెగ్యులేటెడ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లకు సంబంధించి పెరుగుతున్న సంఘటనలు, పెరుగుతున్న విద్య ఖర్చుల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించే కంట్రోల్డ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వంగుర్తించింది.కొత్త నిబంధనల మేరకు కోచింగ్ సెంటర్‌ అంటే. 50 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు పోటీ పరీక్షలు, స్టడీ ప్రోగ్రామ్‌లు లేదా అకడమిక్ సహాయం కోసం కోచింగ్ లేదా అకడమిక్ సపోర్ట్ అందించే కేంద్రాలు. ఇవి యూనివర్సిటీ, కాలేజీ, స్కూల్ సహా వివిధ విద్యా స్థాయిలలోని విద్యార్థులకు సేవలు అందిస్తాయి.  

 కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు  వయో పరిమితి  కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులను చేర్చుకోకూడదు. అదనపు కోచింగ్‌ తీసుకునే ముందు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్‌ కచ్చితంగా పూర్తి చేయాలి.   రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌  కోచింగ్ సెంటర్లు సూచించిన డాక్యుమెంటేషన్ అవసరాలకు కట్టుబడి, స్థానిక అధికార పరిధిలోని అధికారులతో రిజిస్టర్‌ చేసుకోవాలి. కోచింగ్ సెంటర్‌ ప్రతి బ్రాంచ్‌ను ఒక ప్రత్యేక సంస్థగా పరిగణిస్తారు, అన్నింటికీ ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్ అవసరం.   నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు  కోచింగ్ సెంటర్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీలతో పాటు జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ.25, 000 పెనాల్టీ నుంచి రిజిస్ట్రేషన్ రద్దు కూడా చేయవచ్చు. అకడమిక్‌ పర్ఫార్మెన్స్‌కి సంబంధించి తప్పుదారి పట్టించే వాగ్దానాలు చేయకూడదు. పారదర్శకత, జవాబుదారితనం పాటించాలి. పారదర్శకతను ప్రోత్సహించడానికి, కోచింగ్ సెంటర్‌లు ట్యూటర్‌లు, కోర్సులు, పాఠ్యాంశాలు, సౌకర్యాలు, ఇతర సంబంధిత వివరాలను తెలియజేసే వెబ్‌సైట్‌లను నిర్వహించడం అవసరం.   మౌలిక సదుపాయాల ప్రమాణాలు  విద్యార్థుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి, కోచింగ్ సెంటర్లు విద్యార్థికి కనీస స్థల అవసరాలను తీర్చాలి. అగ్నిమాపక భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. తగినంత వెలుతురు, వెంటిలేషన్, ఎలక్ట్రిఫికేషన్‌ మెయింటైన్‌ చేయాలి. CCTV కెమెరాల ఏర్పాటు, వైద్య సహాయం, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.

ఫీజుల నియంత్రణ  మార్గదర్శకాల ప్రకారం, కోచింగ్ సెంటర్లలో సహేతుకమైన ట్యూషన్ ఫీజులు ఉండాలి. స్టూడెంట్స్‌కు ఫీజు రిసీప్ట్‌లు అందించాలి. కోర్సులు, ఫీజు రీఫండ్ విధానాలు, ఇతర సంబంధిత వివరాల గురించి సమగ్ర సమాచారాన్ని కోచింగ్ సెంటర్లు అందించాలి.   క్లాస్ షెడ్యూలింగ్  కోచింగ్ తరగతులు పాఠశాల సమయాల్లో ఉండకూడదు. విద్యార్థులకు పాఠశాల, ఇటు కోచింగ్‌ బ్యాలెన్స్‌ చేసుకునే వెసులుబాటు ఉండాలి. విద్యార్థులు, ట్యూటర్లు ఇద్దరికీ వీక్లీ ఆఫ్‌లు తప్పనిసరి. విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ఉపాధ్యాయులు ఉండాలి.   ఎగ్జిట్‌ పాలసీలు  నిర్ణీత గడువులోపు ప్రో- రేటా రీఫండ్‌తో కోర్సుల నుంచి ఉపసంహరించుకునే వెసులుబాటును విద్యార్థులకు కల్పించారు. కోర్సు వ్యవధిలో ఎలాంటి ఫీజులను పెంచకూడదు.  

 ఫిర్యాదుల పరిష్కారం  కంప్లైంట్‌ మెకానిజం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు కోచింగ్ సెంటర్‌లపై ఫిర్యాదులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. 

Post a Comment

Previous Post Next Post