APలో.. ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు.. వేసవి సెలవులు ఎప్పుడంటే



 గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో.. విపరీతమైన ఎండ ఉంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని.. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎండలు మండుతుండటంతో.. బయటకు రావాలంటనే జనాలు భయపడుతున్నారు. ఇక చిన్నారులు, పెద్దల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాంతో తల్లిదండ్రులు.. ఏపీలో కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ఒకేసారి నిర్వహించేవారు. కానీ ఈ సారి ఏపీలో మాత్రం ఒంటిపూట బడులు ఆలస్యం కానున్నాయి. అయితే ఎప్పటి నుంచి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ఏపీలో ఒంటిపూట బడులపై క్లారిటీ వచ్చేసింది. మార్చి 18 నుంచి హాఫ్‌ డే స్కూల్స్‌ ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇందుకు సంబంధించి.. ఉపాధ్యాయ సంఘాల ద్వారా ఈ మేరకు సమాచారం అందుతోంది. మార్చి 18 నుంచే ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దాంతో ఎగ్జామ్స్‌ నిర్వహించే బడుల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


ఇదిలా ఉంటే తెలంగాణలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారు. అంతేకాదు ఏప్రిల్‌ 24వ తేదీ చివరి పనిదినంగా నిర్ణయించింది ప్రభుత్వం. తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అయితే ఏపీలో ఈ అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది.

పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాలలో ఏకంగా 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎండలు రికార్డుస్థాయిలో నమోదవుతుండటంతో.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post