యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ఎలాంటి ఫీచర్లున్నాయంటే..



మొబైల్ మార్కెట్లో మంచి క్రేజ్ సాధించిన ఫోల్డబుల్ ఫోన్స్ రేస్‌లోకి యాపిల్ కూడా ఎంటర్ అవ్వబోతోంది. త్వరలోనే యాపిల్ నుంచి ఫోల్డబుల్ మొబైల్ రిలీజ్ అవ్వనుందని, ఇప్పటికే ఫోల్డబుల్ ఐఫోన్‌పై వర్క్ జరుగుతోందని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. మొబైల్ టెక్నాలజీ రోజురోజుకీ డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో కంపెనీలు రకరకాల కొత్త ఇన్నోవేషన్స్‌తో ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే ఫోల్డబుల్ ఫోన్లు, ఫ్లిప్ ఫోన్లు, కర్వ్‌డ్ స్క్రీన్స్ వంటివి వస్తున్నాయి. అయితే వీటిలో యాపిల్ బ్రాండ్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, ఎల్‌జీ, మోటొరొలా వంటి బ్రాండ్లు ఇప్పటికే ఫోల్డబుల్ అంటే మడతపెట్టగలిగే ఫోన్లను రిలీజ్ చేశాయి. అయితే యాపిల్ నుంచి ఇలాంటి ఫోల్డబుల్ ఐఫోన్ రావడానికి ఇంకా టైం పట్టేలా కనిపిస్తుంది.

మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన ఫోల్డబుల్ ఫోన్స్ కేటగిరీలో శాంసంగ్‌కు పోటీగా యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను తయారుచేస్తోంది. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం ఇది 2026లో లాంచ్ అవ్వొచ్చని తెలుస్తోంది. ఈ వివరాలను యాపిల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ మింగ్‌చీ కువో ట్వీట్ చేశారు. లీక్ అయిన వివరాల ప్రకారం యాపిల్ కంపెనీ 2026లో ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ.. ఫోల్డబుల్ ఐఫోన్, టాబ్లెట్ కోసం యూఎస్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో అప్లికేషన్ పెట్టింది. ఫోల్డబుల్ లైనప్‌లో ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ బుక్, ఐవాచ్ ఇలా మరిన్ని ప్రొడక్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫోల్డబుల్ స్క్రీన్స్ టెక్నాలజీలో ఇప్పటికే వెనుకబడడంతో ఇతర సంస్థల కంటే మెరుగైన టెక్నాలజీతో ఫోల్డబుల్ డివైజ్ లను రిలీజ్ చేయాలని యాపిల్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మరింత సన్నగా, మడత దగ్గర లైన్ కనిపించకుండా డిజైన్ చేయనుంది. ఇకపోతే ఈ ఏడాది చివరిలో యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో పవర్ బటన్ కింద కొత్త బటన్‌ ఉంటుందని టాక్. ఈ బటన్ ఫొటో లేదా వీడియో క్యాప్చర్‌‌కు ట్రిగ్గర్‌గా పనిచేస్తుందట.


Post a Comment

Previous Post Next Post