తెలుగు రాష్ట్రాలకు IMD హెచ్చరిక.. నేటి వాతావరణ రిపోర్ట్



తెలుగు రాష్ట్రాలలో ఇవాళ మరో 5 రోజులు తీవ్రమైన ఎండలు ఉంటాయి అని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ దాటిందని వివరించారు. ఇవాళ్టి నుంచి 5 రోజులపాటూ ఉష్ణోగ్రత 38 డిగ్రీల దాకా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా వేడి బాగా పెరుగుతుందని వివరించారు. దీనికి కారణం వాతావరణ విభాగం సూచించలేదు. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం సోమవారం నుంచి 3 రోజులపాటూ రాయలసీమలో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. నిన్న దేశంలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కర్నూలులో నమోదైంది. దీన్ని బట్టీ, రాయలసీమలో వేడి ఎంతలా పెరుగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. శాటిలైట్ వర్షపాత అంచనాల ప్రకారం చూస్తే, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. ఐతే.. తెలంగాణలో మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి. అయితే అవి బలంగా ఉండవు. అందువల్ల వేడి ఫీలింగ్ ఉంటుంది. రాత్రి 10 తర్వాత పశ్చిమ రాయలసీమ, తెలంగాణ అంతటా మేఘాలు ఉంటాయి. గాలిని గమనిస్తే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఓ సుడి లాంటిద

Post a Comment

Previous Post Next Post