TTD Jobs Recruitment 2024 -ఉద్యోగాల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్..దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం


 

TTD ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీలు,ఓరియంటల్ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదికన డిగ్రీ లెక్చరర్ల పోస్టులు..టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)జనవరి నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవగా..వీటిలో డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు 49,జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు 29 ఉన్నాయి. అయితే టీటీడీ జూనియర్‌ కాలేజీల్లోని 29 లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి నేటి నుంచి(మార్చి-5,2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం,అప్లయ్ చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 25,2024. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు,జీతం,వయోపరిమితి,విద్యార్హత,ఎంపిక ప్రక్రియ,తదితర వివరాలు ఇక్కడ చూడండి.

TTD Jobs Recruitment 2024 పోస్టుల వివరాలు

జూనియర్ లెక్చరర్ పోస్టులు: 29

సబ్జెక్టుల వారీ జేఎల్‌ ఖాళీలు: హిస్టరీ- 4, సివిక్స్‌- 4, కెమిస్ట్రీ- 4,బోటనీ- 4, తెలుగు- 3,కామర్స్‌- 2,ఫిజిక్స్- 2,జువాలజీ- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1,మ్యాథమెటిక్స్‌- 2 పోస్టులు ఉన్నాయి.

TTD Jobs Recruitment 2024 విద్యార్హత

కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

TTD Jobs Recruitment 2024 వయోపరిమితి

అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

TTD Jobs Recruitment 2024 శాలరీ

నెలకు జూనియర్ లెక్చరర్‌ పోస్టులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఉంటుంది.

TTD Jobs Recruitment 2024 ఎంపిక ప్రక్రియ

కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్స్ వేరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TTD Jobs Recruitment 2024 దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370

UPSC Recruitment 2024 – నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,930 పోస్టులకు నోటిఫికేషన్..

TTD Jobs Recruitment 2024 దరఖాస్తు విధానం

ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి

TTD Jobs Recruitment 2024 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులు ప్రారంభం : మార్చి 5, 2024…దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 25, 2024

Post a Comment

Previous Post Next Post